వాస్తు శాస్త్రం కొన్ని నియమ నిబంధనలతో చెప్పబడింది. వీటిని పాటిస్తే జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ముందుకు సాగుతుంది. వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటె.. అవి మీ జీవితంపై గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లోని కుటుంబ సభ్యుల ఫోటోలు , పెయింటింగ్స్ ను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో కూడా వాస్తు శాస్త్రం నియమాలను చెప్పింది.
Advertisement
చాలా మంది ఇంటి గుమ్మం బయట పెట్టె ఫోటోల గురించి కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. చాలా మంది గుమ్మం బయట దేవుళ్ళ ఫోటోలను, దిష్టి గణపతి ఫోటోలను పెడుతూ ఉంటారు. అయితే ఈ పొరపాటు అస్సలు చేయకూడదట. ఇంటి బయట ఏ దేవుళ్ళ ఫోటోలను పెట్టకూడదట. దాని కంటే ఇంట్లో గుమ్మానికి లోపలి వైపు వెంకటేశ్వర సమేత లక్ష్మీ దేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో లేదా గో సమేత ఐశ్వర్య కాళీ ఫోటో లేదా నరదిష్ఠి తగలకుండా కులదేవతల ఫోటోలు కానీ పెట్టుకోవచ్చట.
Advertisement
గో సమేత ఐశ్వర్య కాళీ ఫోటో పెట్టుకుంటే ఆ ఇంట్లో చెడు ప్రభావం పడకుండా మంచి జరుగుతుందట. అలానే ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. వారికి ఐశ్వర్యం లభిస్తుందట. చాలా మంది తెలియక దిష్టి తగలకుండా ఉండడం కోసం గణపతి ఫోటోను ఇంటి బయట పెడుతున్నారని, కానీ ఇది మంచిది కాదని, గణపతి ఫోటోను ప్రధాన ద్వారం ఎదురుగ పెట్టాలని చెబుతున్నారు. మరి కొందరు ప్రధాన ద్వారం ఎదురుగా లక్ష్మి దేవి ఫోటోను పెడుతుంటారు. ఇలా పెడితే, లక్ష్మి దేవికి ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి మనమే మార్గం చూపినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి.
మరిన్ని ముఖ్య వార్తలు:
VASTU TIPS: ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలా? అయితే ఈ టిప్స్ పాటించండి!
ఆడవారు పుట్టింటి నుంచి ఈ వస్తువులను తీసుకురావద్దు!
VASTU TIPS: ఈ మొక్కను మీ ఇంటికి సరైన దిశలో పెంచండి.. ఇక ఇంట్లో డబ్బే డబ్బు..!!