Home » ఏపీ సీఎం జగన్ కి షర్మిల షాక్.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందా..? 

ఏపీ సీఎం జగన్ కి షర్మిల షాక్.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందా..? 

by Anji
Ad

తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడూ ఏ రెండు పార్టీలు కలిసి ఉంటాయో.. విడిపోతాయో కూడా చెప్పలేము. రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తుందని.. వాస్తవానికి షర్మీల పార్టీకీ క్షేత్రస్థాయిలో బలం లేదనే చెప్పాలి. రాజన్న బిడ్డగా ఆమెను చూస్తున్నారు. అయితే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే మాత్రం.. ఆ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుందంటూ అనలిస్ట్ దాము బాలాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

Advertisement

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే అధికారం దక్కించుకున్నారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఏపీలో, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వినియోగించుకోలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరూ జగన్ వైపు మొగ్గు చూపారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కొంత మంది టీఆర్ఎస్ లోకి వెళ్లితే.. మరికొందరూ కాంగ్రెస్ లో ఉన్నారు. తెలంగాణలో షర్మిల ప్రజల కోసం రాజన్న ఆశయాలను నెరవేర్చాలని పార్టీ పెట్టింది. పాదయాత్ర అంటూ మరోసారి జనంలోకి వెళ్లింది. తాజాగా వినిపిస్తున్న మాట షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి తన తండ్రి పుట్టిన రోజు జులై 08న విలీనం చేయబోతుందని తెలిపారు బాలాజీ. ఇప్పటికే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో షర్మిల చర్చించిందని.. ఆయన తండ్రికి మంచి స్నేహితుడు అని ప్రచారం జరుగుతోంది. 

Advertisement

తాజాగా రాహుల్ గాంధీ పుట్టిన రోజున షర్మిల సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తుంది. షర్మిల పార్టీ విలీనానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఒప్పుకోకపోవడానికి సిద్ధంగా లేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి మాత్ంర దీనికి సుముఖంగా లేరని చెప్పవచ్చు. ఈ ఇష్యూ కచ్చితంగా ఏపీలో ప్రభావం చూపే అవకాశముంది. జగన్ మీద ఈ అంశం ప్రతికూల ప్రభావం చూపవచ్చని బాలాజీ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ షర్మిలను ఏపీ కాంగ్రెస్ లోకి తీసుకుంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపి జగన్ కి నష్టమే అంటున్నారు. ఏం జరుగుతుందనేది మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 CSK : ఏపీ సీఎం జగన్ కు మహేంద్ర సింగ్ ధోని సాయం..!

భారతీయుల కోసం బ్రిటీష్ వారు చేసిన ఈ ఐదు మంచి పనుల గురించి మీకు తెలుసా ? 

 మల్లు భట్టి విక్రమార్క 100 రోజులు పాదయత్ర పూర్తి..!

Visitors Are Also Reading