Home » Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?

Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?

by Bunty
Ad

ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అయినటువంటి రామ్ చరణ్-ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ కొన్నాళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 14 జూన్, 2012న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 12 సంవత్సరాలకు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 1:40 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. వారికి ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి రోజున ఆడబిడ్డ ఇంటికి రావడంతో సాక్షాత్తు దేవుని కృపతో మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

అలాగే ఉపాసన-రామ్ చరణ్ తమ కూతురికి అంజలిదేవి అనే హీరోయిన్ పేరు పెట్టాలని అనుకుంటున్నారట. కాగా, రామ్ చరణ్-ఉపాసన ఆస్తుల విలువ ఎంత అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం… రామ్ చరణ్-ఉపాసనలకు విడివిడిగా వేలకోట్ల ఆస్తులు ఉన్నాయట. రామ్ చరణ్ హీరో కాగా, ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా పలు రకాల వ్యాపారాలను కూడా నిర్వర్తిస్తున్నారు.

Advertisement

అయితే వీరిద్దరిలో ఉపాసన కన్నా రామ్ చరణ్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయట. ఉపాసనను పెళ్లి చేసుకున్న తర్వాత చరణ్ కు ఆర్థికంగా బాగా కలిసి వచ్చిందట. వీరిద్దరి ఉమ్మడి ఆస్తుల విలువ 2500 కోట్లు. ఈ ఆస్తులలో ఉపాసన ఆస్తి విలువ 1130 కోట్లు. అంటే రామ్ చరణ్ ఆస్తుల విలువ 1,370 కోట్లు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ మార్కెట్ విలువ 70 వేల కోట్లు. రాబోయే రోజుల్లో ఉపాసన ఆస్తి విలువ మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో అరుదైన సంఘటన..భర్త లేకుండా నిహారిక, భార్య లేకుండా పవన్ ?

Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన నటులు ఎవరంటే…!

Visitors Are Also Reading