Home » Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

by Bunty
Ad

భారతదేశానికి దిగువన ఉన్న శ్రీలంక దేశం గురించి తెలియని వారు ఉండరు. నలుమూలల సముద్రంతో చుట్టి ఉన్న దేశమే ఈ శ్రీలంక. అయితే కరోనా మహమ్మారి తర్వాత… శ్రీలంక దేశంలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక… దేశం నష్టాల పాలయింది. దీంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక దేశం. ఇక ఇప్పుడిప్పుడే ఆ దేశం కోలుకుంటోంది.

Advertisement

అయితే ఈ సంక్షోభం దెబ్బకు చాలామంది శ్రీలంకను వదిలి ఇండియాకు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సెటిల్ అయిపోయారు. ఇక కొంతమంది వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. కొంతమంది శ్రీలంకలోనే కుమిలిపోతున్నారు. అయితే శ్రీలంక దేశానికి చెందిన మాజీ క్రికెటర్ మాత్రం.. ఈ సంక్షోభం దెబ్బకు బస్సు డ్రైవర్ గా మారిపోయాడు. అతను ఎవరో కాదు శ్రీలంక మాది స్పిన్నర్ సూరజ్ రందివ్. ఇతను ఒకప్పుడు శ్రీలంక జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు.

Advertisement

అలాగే 2011 వన్డే ప్రపంచ కప్ జడ్డులో కూడా… సూరజ్ కీలకపాత్ర పోషించాడు. ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో… మెరుగైన బౌలింగ్ చేశాడు సూరజ్. అలాంటి సూరేజ్ రందీవ్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో నివాసముంటున్న సూరజ్…. అక్కడ ఓ పెద్ద కంపెనీలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే సూరజ్… ధోని కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా ఒకప్పుడు ఆడాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?

2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?

Visitors Are Also Reading