భారతీయ క్రికెటర్లు తమ దేశం పట్ల ప్రేమని, కరుణని చూపించడంలో ముందు ఉంటారు. భారత జెర్సీని ధరించడం వారికి కొంత గర్వకారణంగా ఉంటుంది. ధోని కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీం ఇండియా సాధించిన విజయాలలో ధోని కి సింహభాగం భాగస్వామ్యం ఉంటుంది. ధోని రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్. అతని కూల్ నెస్, ఎటువంటి సిట్యుయేషన్ ని అయినా తెలివిగా హేండిల్ చేసే ఓర్పు సహనాలు ధోనిని కెప్టెన్ కూల్ గా పిలుచుకునేలా చేసాయి.
Advertisement
MS ధోని భారత సైన్యాన్ని ఆరాధిస్తాడని మరియు భారత సైనికులతో వారి ఔట్‌పోస్టుల వద్ద కొంత సమయం గడపడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడు అనేది అందరికి తెలిసిన విషయమే. అంతేకాకుండా, MS ధోనీ “కార్గో ప్రింట్”ను ధరించి పాపులర్ అయిన మొదటి క్రికెటర్ కూడా. అతనికి ఎంత దేశభక్తి ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఇతర క్రికెటర్లకు ఉన్నట్లు హెల్మెట్ పై ఇండియన్ ఫ్లాగ్ ధోని హెల్మెట్ పై మాత్రం ఉండదు.
Advertisement
ఈ విషయమై ఓ వ్యక్తి కోరా లో తన ప్రశ్నని సాధించగా, మరో యూజర్ ఇలా సమాధానం ఇచ్చాడు. ధోని ఒక బెస్ట్ వికెట్ కీపర్. వికెట్ కీపర్ తన పని తానూ చేస్తున్నప్పుడు ఎక్కువగా పరిగెత్తడం లేదా కింద పడడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో హెల్మెట్ కూడా కింద పడే అవకాశం ఉంటుంది. దేశ త్రివర్ణ పతాకం నేలని తాకకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ధోని తన హెల్మెట్ పై ఇండియన్ ఫ్లాగ్ ని ఉంచుకోడు. ఈ విషయం తెలిసాక కెప్టెన్ కూల్ ధోని పై మరింత గౌరవం పెరుగుతోంది కదా.
ఇవి కూడా చదవండి
Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?
2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?
Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్