కొన్ని సామెతలు ఎలా మొదలవుతాయి తెలియదు కానీ చాలా పాపులర్ అయిపోతుంటాయి. ఒక్కోసారి మనం అది నిజమేనేమో అని కూడా అనుకుంటూ ఉంటాం. అలంటి సామెతల్లోనే ఒకటి “తలలో రెండు సుడులు ఉంటె రెండు పెళ్లిళ్లు అవడం”. అసలు ఈ సామెతలో వాస్తవం ఉందొ లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా తల మధ్య భాగంలో అందరికీ ఒక గుండ్రటి సుడి ఉంటుంది. ఈ సుడి చుట్టూనే జుట్టు వస్తుంది. అయితే.. కొంతమందిలో ఇవి రెండు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇలా ఉంటె మాత్రం వీరికి రెండు పెళ్లిళ్లు అవుతాయని, వీరు పట్టిందల్లా బంగారమేనని అంటుంటారు. ఈ విషయమై పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం. తలలో రెండు సుడులు ఉన్నంతమాత్రాన రెండు పెళ్లిళ్లు కావని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా అలా జరిగినా అది యాదృచ్ఛికమే అని పేర్కొన్నారు. తలలో రెండు సుడులు ఉంటె రెండు పెళ్లిళ్లు అవుతాయని ఏ శాస్త్రమూ చెప్పలేదు.
Advertisement
అయితే.. రెండు సుడులు ఉన్న వారు మాత్రం అదృష్టవంతులు. వీరు సాధారణ వ్యక్తుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారు. చాలా తెలివిగా ఉంటారు. అంతత్వరగా వీరు మోసపోరు. వీరికి మోసం చేసే గుణం కూడా ఉండదు. కష్టపడి పైకి వస్తారు. వీరికి క్రియేటివిటీ అధికంగా ఉంటుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరు ఏ రంగంలో అయినా రాణించగలరని, వీరికి ఆలోచన శక్తీ మెండుగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతే కానీ, తలలో రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు అవుతాయనడం కేవలం అపోహ మాత్రమేనని అంటున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !
ఆదిపురుష్ మూవీలో సీత రాముడు కాకుండా.. రాఘవుడు జానకి ఎందుకు పెట్టారో తెలుసా ?
పెళ్లి చేసుకొని విడిపోయి చాలా కాలం ఒంటరిగా ఉన్న 8 నటులు..!!