కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో వచ్చిన లాక్ డౌన్ లతో సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీయగా అవి విడుదల కాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. కొంత మంది తమ సినిమాలను తక్కువ ధరకే ఓటీటీలో విడుదల చేసుకోవాల్సి వచ్చింది. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ట్రాల్లో 50 శాతం షూటింగ్ పరిమితులను అమలు చేస్తున్నారు.
Advertisement
కొన్ని రాష్ట్రాల్లో అయితే థియేటర్లను పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలో పలు సినిమాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకున్నాయి. వాటిలో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ కూడా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీగా ప్రమోషన్లను కూడా నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను డివివి దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది.
Advertisement
దాంతో ఆ డబ్బులను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇక 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం కూడా భారీగా ఖర్చు చేసింది. దాంతో నిర్మాత దానయ్య సైతం ఫైనాన్షియర్ ల వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వలేని పరిస్థితి కి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ భారాన్ని మోసేందుకు రాజమౌళి ముందుకు వచ్చారు. దాదాపు 180 కోట్ల అప్పు ను రాజమౌళి తన పైన వేసుకున్నారు. ఇక ఈ సినిమాలో రాజమౌళి కి కూడా భారీ మొత్తంలో షేర్ ఉన్న సంగతి తెలిసిందే.