Home » కేజీఎఫ్‌-2 నుండి క్రేజీ అప్టేట్…ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో య‌ష్ ను చిపిస్తూ ఆ రూమ‌ర్స్ కు చెక్.!

కేజీఎఫ్‌-2 నుండి క్రేజీ అప్టేట్…ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో య‌ష్ ను చిపిస్తూ ఆ రూమ‌ర్స్ కు చెక్.!

by AJAY
Ad

రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన సినిమా కేజిఎఫ్ దేశ వ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 ను కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్ర యూనిట్ వదిలింది. ఈ సినిమా నుండి పోస్టర్ ను విడుదల చేయగా ఎంతో ఇంట్రెస్ట్ గా కనిపిస్తోంది.

Advertisement

kgf 2

kgf 2

పోస్టర్ లో కాషన్ డేంజర్ ఎహెడ్ అంటూ హెచ్చరిక బోర్డు ఉండ‌గా పక్కన హీరో యష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కూడా విడుదల వాయిదా వేసుకుంటుంది అని రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో మరోసారి విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ఏప్రిల్ 14నే విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. అదేవిధంగా హీరో య‌ష్ కు చిత్రయూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. నేడు య‌ష్ పుట్టిన రోజు కావ‌డంతో ట్విట్ట‌ర్ లో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. కేజీఎఫ్-2 పోస్టర్ ను ట్రెండింగ్ లోకి తీసుకువ‌చ్చారు.

Advertisement

Visitors Are Also Reading