మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ వీటిపై ఇరువురు స్పందించలేదు. దాదాపు వీరు 8 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ వారి ప్రేమను చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారు. అయితే వీరు అంతరిక్షం సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారని… అప్పటి నుంచే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు.
Advertisement
కట్ చేస్తే.. వరుణ్ తేజ్- లావణ్ ల ఎంజేగ్ మెంట్ జూన్ 9 న జరిగింది. నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్- లావణ్ ల ఎంజేగ్ మెంట్ జరిగింది. అయితే వీరి ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరయ్యారు. కానీ నిహారిక భర్త చైతన్య ఎంగేజ్మెంట్ కు రాలేదు. దీంతో వీరి విడాకులు ఖాయమని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీజ కూడా తన రెండో భర్త లేకుండానే ఎంగేజ్మెంట్ కు వచ్చింది. ఇప్పటివరకు వీరి విడాకులపైన ఎలాంటి క్లారిటీ రాలేదు. విడాకులు తీసుకోకపోతే వీరిద్దరూ వారి భర్తలతో కలిసి ఎంగేజ్మెంట్ కు వచ్చేవారని అంటున్నారు.
Advertisement
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అయిన అన్నా లేజీనావోను ఎంగేజ్మెంట్ కు తీసుకురాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చాడా… లేకపోతే ఏమైనా కారణాలవల్ల తీసుకురాలేదా… అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని సమాచారం. కాగా, గత కొంత కాలంగా మెగా కూతురు నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వచ్చింది సంగతి తెలిసిందే. అటు శ్రీజ – కళ్యాణ దేవ్ ల పరిస్థితి అదే కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?
Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన నటులు ఎవరంటే…!