Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాడు శుభ్ మన్ గిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐపీఎల్ లో చాలా కన్సిస్టెంట్ గా రాణించి… టీమిండియా జట్టులో పదిలమైన స్థానాన్ని దక్కించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్ గిల్. ముఖ్యంగా 2022 ఐపిఎల్ టోర్నమెంట్ లో.. గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్స్ గా నిలబెట్టడంలో… శుభమన్ గిల్ పాత్ర చాలా గొప్పది. ఆది నుంచి చివరి వరకు… వికెట్ పడకుండా గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు శుభ్ మన్ గిల్.
Advertisement
అలాగే ఈ ఏడాది ఐపీఎల్ 2023 టోర్నీలో కూడా గుజరాత్ టైటాన్స్ జట్టును రన్నర్ అప్ గా నిలిపాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఐపీఎల్ లో బీకర బ్యాటింగ్ తో రెచ్చిపోయిన గిల్… టీమిండియాలోనూ మంచి ఆట తీరును కనబరిచాడు. ఇది ఇలా ఉండగా… తాజాగా గిల్ ను టీమిండియా కెప్టెన్ గా చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ లో రోహిత్ సేన ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని డిమాండ్ కూడా పెరుగుతుంది.
Advertisement
ఈ తరుణంలో రోహిత్ శర్మాను పక్కకు పడితే… ఎవరిని కెప్టెన్ చేయాలనే దానిపై బీసీసీఐ పెద్దలు మల్ల గొల్లాలు పడుతున్నారు. మొన్నటి వరకు రహనే మరియు శ్రేయస్ అయ్యర్ పేరు వినపడగా… తాజాగా రోహిత్ శర్మకు అసలైన వారసుడు గిల్ అనే వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా సెలెక్టర్ భూపేందర్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గిల్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ ను నేను ఎప్పుడు చూడలేదు. గిల్ ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ చేస్తే చాలా బాగుంటుంది అని భూపేందర్ సింగ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?
Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్
Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్ పనికిరారు ?