మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్లో ఓ అగ్ర హీరోగా దూసుకెళ్లుతున్నాడు. తొలుత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో పరిచయం అయ్యాడు. తొలిచిత్రం విజయం సాధించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో రామ్ చరణ్ అందరి మదిలో నిలిచిపోయాడు. ఇక అప్పటి నుంచి మెగాపవర్ స్టార్ తనదైన శైలిలో నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వలో ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన రామ్చరణ్ ఎంతమంది మదినిదోచుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే ఈ సీనిమాలో అతని ఫస్ట్ లుక్, టీజర్, నాటు నాటు సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటి విడుదల కొద్ది క్షణాల్లో వైరల్గా మారడం విశేషం.
Advertisement
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సైరా నర్సింహారెడ్డి అద్భుతమైన నటనను కనబరిచారు. విడుదలకు సిద్ధంగా ఉన్న చిరంజీవి ఆచార్యలో కూడా రామ్చరణ్ నటించడం విశేషం. చిరంజీవి కూడా ఇంకా మరొక రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి రాకముందు 2004 ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పరిచయం చేశాడు చిరంజీవి. అప్పుడు రామ్ చరణ్ స్టేజీమీద మాట్లాడడానికే చాలా టెన్షన్ పడ్డాడు.
Advertisement
ముఖ్యంగా ఈరోజే తొలిసారిగా మాట్లాడబోతున్నాడు నా కుమారుడు అని పరిచయం చేశాడు. మాట్లాడేంత పెద్ద వాడు అని నేను ఏమి అనుకోవడం లేదు కానీ చూద్దాం ఏమి మాట్లాడుతాడో అని మైకు ఇచ్చాడు. అప్పుడు రామ్ చరణ్ మాట్లాడడానికి చాలా తడబడ్డాడు. తన తండ్రి చిరంజీవి వెనుక లేకపోతే అసలు నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు. వెంటనే చిరంజీవి మైకు తీసుకుని చూసారా మనం వెనుక లేకపోతే భయపడుతున్నాడని పేర్కొనడం గమనార్హం. అప్పుడు ప్రేక్షకులందరి తరుపున నేను డాడీ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి తండ్రి కాళ్లు మొక్కాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది.