Home » ఈ హీరోలు ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలు ఇవే…!

ఈ హీరోలు ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలు ఇవే…!

by Bunty
Ad

పెళ్లంటే నూరేళ్లపంట. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి జీవితంలో తోడు అనేది చాలా ముఖ్యం. నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకి విడిపోతున్నారు. సెలబ్రిటీలైతే మరీ ఎక్కువ. అతి చిన్న విషయానికి విడాకుల వరకు వెళుతూ ఉన్నారు. ఈ కాలంలో ఇలాంటి వార్తలు విని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు కొంతమంది హీరోలు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సినిమాలను అందిస్తూ ఉంటాడు. అయితే ప్రభాస్ 45 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్నాడు. తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నను ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగితే దానికి సమాధానంగా ప్రభాస్ నేను మ్యారీడ్ లైఫ్ ని మెయింటైన్ చేయలేను. అది నా వల్ల కాదు అని సమాధానం చెప్పాడు. ఇక రీసెంట్ గా జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా త్వరలో తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పడం జరిగింది.

siddarth

# సిద్ధార్థ్

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి హీరో సిద్ధార్థ్ తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సిద్ధార్థ్ న్యూఢిల్లీలోని మేఘన అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక 2003లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్, సమంతతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అది కుదరకపోవడంతో ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు.

Advertisement

# విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్నటువంటి విజయ్ 35 ఏళ్ల వయసు వచ్చిన ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను పెళ్లి చేసుకోవడానికి మరికొన్ని సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

# ఆర్.నారాయణ మూర్తి

అనేక చిత్రాల్లో నటించినటువంటి మన పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి 70 ఏళ్ల అయినా ఒంటరిగానే ఉంటున్నాడు. ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను చిన్న వయసులోనే తనకన్నా తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ తక్కువ కులం కావడం వల్ల వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించి ఒంటరిగానే మిగిలిపోయాడు.

# విశాల్ కృష్ణారెడ్డి

ఇతను తమిళ్ మరియు తెలుగు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. 2019లో హైదరాబాద్ అమ్మాయి అనిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. దీనికి కారణం అతను వరలక్ష్మి శరత్ కుమార్ ను అమితంగా ఇష్టపడ్డాడు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో అతను వివాహం చేసుకోకుండా ఇప్పటివరకు సింగిల్గానే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

Kavya Kalyan Ram : ‘బలగం’ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఇవే ..!

భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

Visitors Are Also Reading