Home » గత 10 ఏళ్లుగా టీమిండియా.. ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీలను ఎందుకు గెలవడం లేదు ?

గత 10 ఏళ్లుగా టీమిండియా.. ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీలను ఎందుకు గెలవడం లేదు ?

by Bunty
Ad

దేశంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరు ఉంది. అంత దనికమైన క్రికెట్ బోర్డు ఉన్నప్పటికీ… ఐసీసీ మెయిన్ టోర్నమెంట్లలో టీమిండియా గోరంగా విఫలం అవుతూ వస్తోంది. 2011 వరల్డ్ కప్ ను ధోని సారధ్యంలో అందుకున్న టీమిండియా… 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకని చరిత్ర సృష్టించింది. ఇక 2013 నుంచి 2023 వరకు దాదాపు పది ఏళ్ల గ్యాప్ లో… ఏ ఒక్క ఐసీసీ టోర్నీ కొట్టలేకపోయింది టీమిండియా. అయితే ఐసీసీ తోనే కొట్టకపోవడం వెనుక కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

2014 సంవత్సరంలో t20 వరల్డ్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక పై తలపడ్డ టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు ముఖ్యంగా యువరాజ్ రాణించకపోవడంతో టీమిండియా ఓడిపోయింది. ఇక 2017 వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ ముంగిట ఆస్ట్రేలియా ఓడిపోయింది టీమిండియా. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు విఫలము కావడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇక 2016 t20 వరల్డ్ కప్ లో… సెమీఫైనల్ ముంగిట వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది టీమిండియా. ఈ ఓటమికి కారణం బౌలింగ్. 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో చిత్తు అయింది టీమ్ ఇండియా.

Advertisement

దీనికి కారణం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు. 2019 సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో ఓటమిపాలైంది టీమిండియా. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ లో న్యూజిలాండ్ చేతిలో టీం ఇండియా ఓడిపోయింది. దీనికి కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కారణం. 2021 t20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజి నుంచి వైదొలిగింది టీం ఇండియా.

దీనికి కారణం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే. 2022 టి20 వరల్డ్ కప్ లో.. సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీనికి కారణం కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యమే. ఇక తాజాగా 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో కూడా… ఆస్ట్రేలియా చేతిలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓడిపోయింది. ఇలా ప్రతిసారి టాపార్డర్ బ్యాటింగ్ లేదా మిడిల్ ఆర్డర్ కారణంగా ఓటమి పాలవుతూ వస్తోంది. ఈ మైనస్ పాయింట్లన్నీ టీమ్ ఇండియా అధిగమిస్తేనే… ఐసీసీ టోర్నమెంట్ కొట్ట గలదు.

ఇవి కూడా చదవండి

ODI World Cup 2023 : ఆ రెండు ఇండియా పిచ్‌ లంటే వణికిపోతున్న పాక్‌..? కారణం ఇదేనా..?

టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్ గా అజింక్య రహానే !

Visitors Are Also Reading