Home » వైర‌ల్ : రెండు విభిన్న గెట‌ప్పులో కార్తీ ‘స‌ర్దార్‌’

వైర‌ల్ : రెండు విభిన్న గెట‌ప్పులో కార్తీ ‘స‌ర్దార్‌’

by Anji
Ad

కోలీవుడ్‌లో విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకోవాల‌న్నా.. కొత్త కొత్త ప్ర‌యోగాలు చేయాల‌న్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్ప‌టివ‌ర‌కు కార్తీ చేసిన సినిమాలు అన్నీ విభిన్న‌మైన క‌థ‌లే అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇక కార్తీకి త‌మిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజే ఉన్న‌ది. ఆయ‌న సినిమాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగులో డ‌బ్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం కార్తీ స‌ర్దార్, విరుమ‌న్ చిత్రాల‌లో పాటు మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇక‌పోతే పాత్ర కోసం ప్రాణం పెట్టే కార్తీ స‌ర్దార్ సినిమా కోసం రెండు విభిన్న‌మైన గెట‌ప్పుల‌లో క‌నిపించ‌నున్నాడట‌.

karthi

Advertisement

Advertisement

చ‌క్ర ఫేమ్ పీఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ గెట‌ప్ తో పాటు ఓ వృద్ధులం గెట‌ప్‌లో కూడా కార్తీ మెర‌వ‌నున్నాడు. కార్తీ టూ డైమ‌న్ష‌న్ ఉన్న పాత్ర‌ల్లో ఉన్న‌ఫొటోలు నెట్టింట వైర‌ల్ మారాయి. యంగ్‌లుక్‌లో ఉన్న కార్తీ కొద్దిగా ఒళ్లు చేసి క‌నిపించ‌గా.. ఓల్డ్ లుక్ కోసం కార్తీ చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. తెల్ల‌జుట్టు బ‌క్క‌ప‌ల‌చ‌ని శ‌రీరంతో అద‌ర‌గొట్టేసాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈసినిమాలో కార్తీ స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టిస్తుండ‌గా సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్, బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాతో కార్తీ మ‌రొక‌సారి హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే కొద్ది రోజుల ఎదురుచూడ‌క త‌ప్ప‌దు.

Visitors Are Also Reading