అనాదిగా ఆచరిస్తూ వస్తున్న హిందూ ధర్మ సంప్రదాయాలలో ఎన్నో నిగూడార్ధాలు దాగి ఉన్నాయి. మానవ క్షేమం కోసమే హిందూ ధర్మంలో ఆచారాలను, సంప్రదాయాలను రూపొందించారు. ఇవన్నీ మూఢనమ్మకాలు అని మనం కొట్టి పడేసినా.. వాటి వెనుక దాగి ఉన్న నిగూడార్ధాల రహస్యాన్ని మనం నమ్మే సైన్స్ ఛేదించలేకపోతోంది. మనం పూజల్లో బిల్వ పత్రాలను వాడుతూనే ఉంటాం.
Advertisement
బిల్వం లేకుండా ఏ పూజ పూర్తి అవ్వదు. ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వం ఆకుని శివుని అభిషేకం చేయించేటప్పుడు కచ్చితంగా వినియోగిస్తాము. బిల్వము ఆకు త్రిభుజాకారంలో ఉండి మరో మూడు చిన్న ఆకులుగా విడిపోతుంది. ఈ మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర మూడు కన్నులుగా భావిస్తారు. ఈ మూడు కన్నులు జ్ఞానం, నిర్ణయం తీసుకోవడం, క్రియలకు సంబంధం కలిగి ఉంటాయి. ఇంట్లో బిల్వ చెట్టు ఉంటె ఇంట్లోని దుష్టశక్తులు తొలగిపోతాయి.
Advertisement
బిల్వ ఆకు ఇంట్లో ఉండడం ఎంతో శుభప్రదం. బిల్వ ఆకుని చెట్టునుంచి కోసి మహాదేవుని పూజించే ముందు ఆకుపై గంధంతో ఓంకారం రాయండి. ఇంటికి వాయువ్య., దక్షిణ, ఉత్తర దిక్కులలో బిల్వ చెట్టుని ఉంచితే ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. ఇంటిపై పడే దుష్ట శక్తులను బిల్వము దూరం చేస్తుంది. ఇంట్లో బిల్వ చెట్టు ఉంటె సుఖ సంతోషాలు కలిగి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అయితే సోమవారాలు, మకర సంక్రాంతి, పూర్ణిమ, అమావాస్య, అష్టమి , నవమి రోజుల్లో మాత్రం బిల్వాన్ని తీయవద్దు.
నోట్: ఈ కథనం కేవలం ప్రజల నమ్మకాల ఆధారంగా రాయబడింది. ఇది వాస్తవమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
మరిన్ని ముఖ్య వార్తలు:
CHANAKYA NITI : స్త్రీలలో ఈ 4 లక్షణాలు ఉండకూడదు..
CHANAKYA NITI : భార్యభర్తల బంధం బలపడాలంటే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..!
ధనవంతులు అయ్యే వారికి ఈ సంకేతాలు కనిపిస్తాయనే విషయం మీకు తెలుసా ?