సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆదిపురుష్ మూవీ గురించే చర్చ నడుస్తుంది . బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ఆదిపురుష్ రూ.500 కోట్ల బడ్జెట్‌తో రామాయణం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం ఈ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ రిలీజ్ టైం నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ఈ మూవీ తొలిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సక్సెస్ దిశగా దూసుకుపోతుంది.
Advertisement
భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7000 కి పైగా థియేటర్స్‌లో విడుదలైంది. మొదటి నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్ చిత్రానికి ఇప్పుడు మరో కొత్త విమర్శ ఎదురయ్యింది. ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేసిన మనోజ్ ముంతాషిర్ శుక్లా ఆదిపురుష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా అసలు రామాయణం కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Advertisement
ఆయన తాజాగా ఓ హిందీ మీడియాతో ముచ్చటిస్తూ.. ఆదిపురుష్ మూవీ అసలు రామాయణం కాదని.. ఈ సినిమా ఎక్కువగా రామాయణంలోని వనవాసం, యుద్ధ కాండల నుంచి ప్రేరణగా తీసుకోవడం జరిగిందని మనోజ్ ముంతాషిర్ శుక్లా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని డిస్క్లేమర్‌లో కూడా ఇచ్చామని, కేవలం మార్కెటింగ్‌లో భాగంగా చేశామని.. అసలు ఆదిపురుష్ మూవీ రామాయణం కాదనీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో ఆదిపురుష్ చిత్రాన్ని ట్రోల్ చేయడానికి ట్రోల్లర్స్ కి మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు రైటర్ మనోజ్ శుక్లా.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
“సమరసింహారెడ్డి” సినిమాలో నటించిన ఈ అమ్మాయి రామ్ చరణ్ కి ఏమవుతుందో తెలుసా..?
బలగం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేతులారా వదులుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?
ఓంరౌత్ గారూ.. మా అమృతం సీరియల్ ని కాపీ కొట్టేశారా? ‘ఆదిపురుష్’ లో ఇది గమనించారా?