Home » నిమ్మ తొక్కే కదా అని పడేస్తున్నారా..? దీనివలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడు ఆ పని చేయరు..!

నిమ్మ తొక్కే కదా అని పడేస్తున్నారా..? దీనివలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడు ఆ పని చేయరు..!

by Mounika
Ad

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో దానిపైన ఉన్న పీల్‌ (తొక్క) వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

నిమ్మ తొక్కను ఎండబెట్టి పొడిలా తయారు చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల అందులో ఉందే సహజమైన ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, కెప్టెన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయం చేస్తుంది. ఇందులోని లక్షణాలు రక్తపోటును అదుపులో ఉంచటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన శరీరంలో తెల్ల రక్త కణాలు సంఖ్య పెరిగి క్యాన్సర్ కారకమైన కణాలని నాశనం చేస్తాయి.

Advertisement

నిమ్మ తొక్కలో యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. రోజు ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ తొక్క పొడిని వేసుకోని తాగడం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి. ఈ పొడిని చర్మానికి అప్లై చేయడం వలన ఫంగస్, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Lemons

6 గ్రాములా నిమ్మ తొక్క పొడిలో 1 గ్రాము ఫైబర్, 3 కేలరీలు, 90 శాతం విటమిన్ సి మన శరీరానికి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం వలన చర్మం లో ఫ్రీ రాడికల్ తో పోరాడి చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వలన మలబద్ధక సమస్య కూడా నివారిస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Health Tips : రాత్రిపూట పొరపాటున కూడా వీటిని తినవద్దు..!

కొడాలి నాని వలన ఎన్టీఆర్, వి. వి వినాయక్ కాంబినేషన్లో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?

ఓలా, ఊబర్ డ్రైవర్స్ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఏమి చేయాలి? తప్పకుండా తెలుసుకోండి!

 

Visitors Are Also Reading