Home » ఇండియా వర్సెస్ పాక్ మధ్య 3 మ్యాచ్ లు.. ఎప్పుడంటే ?

ఇండియా వర్సెస్ పాక్ మధ్య 3 మ్యాచ్ లు.. ఎప్పుడంటే ?

by Bunty
Ad

ఆసియా కప్ 2023 విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్టుగా హైబ్రిడ్ మోడల్ కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పచ్చ జెండా ఊపడం దాదాపుగా ఖాయం అయిందని సమాచారం. భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్ లు పాకిస్తాన్ లో భారత్ ఆడే మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించేందుకు ఎసిసి ఒప్పుకుందని తెలుస్తోంది. పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆసియా కప్ లో భాగంగా జరిగే 13 మ్యాచ్లు నాలుగు లేదా ఐదు మ్యాచ్లు మాత్రమే వారి స్వదేశంలో జరిగే అవకాశం ఉంది.

Advertisement

భారత్-పాక్ మ్యాచ్లు సహా భారత్ ఆడే మ్యాచ్ లని శ్రీలంక వేదికగా జరుగుతాయి. టీమిండియా ఫైనల్ కు చేరితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు. అలాగే ఈ టోర్నీ షెడ్యూల్ లోను స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సెప్టెంబర్ 1-17 మధ్యలో ఈ టోర్ని జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లని లాహోర్ లో జరుగుతాయని తెలుస్తోంది. మొత్తంగా ఆసియా కప్ 2023 విషయమై మరికొద్ది రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని… కాగా, రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులు తోలుత పాకిస్తాన్ కు దక్కాయి.

Advertisement

భారత్-పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో బీసీసీఐ భారత జట్టును పాక్ కు పంపించేందుకు నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ లో నిర్వహిస్తామని పాక్ చెప్పింది. పాక్ ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే చెప్పిన మిగతా దేశాలు ఎండలకు సాకుగా చెప్పి నిరాకరించాయి. దీంతో మధ్య మార్గంగా ఎసిసి శ్రీలంక పేరును ప్రతిపాదించగా అందుకు అన్ని దేశాలు సరే అన్నాయి.

ఇవి కూడా చదవండి :

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

IT బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు… చంద్రబాబుపై అంబటి రాయుడు ఫైర్

Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

Visitors Are Also Reading