Home » Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

by Bunty
Ad

బుల్లితెర హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక మెజీషియన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్ ఈటీవీ జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో అవకాశాన్ని సాధించుకొని చాలా పాపులర్ అయ్యి ఆ తర్వాత టీం లీడర్ స్థాయి నుంచి ఒక హీరోగా ఎదిగాడు సుదీర్. సుధీర్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. తన డైలాగ్స్, తన యాక్షన్, తన సెంటిమెంట్ మాటలకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

సాఫ్ట్వేర్ సుధీర్ తో హీరోగా పరిచయమైనటువంటి ఈ హీరో ఆ తర్వాత గాలోడు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా సుధీర్, రష్మీ మధ్య ఉండే కెమిస్ట్రీకి చాలామంది ఫిదా అయ్యారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనేకమంది అంటూ ఉంటారు. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని, వీరు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఈ వార్తలపై వారిద్దరూ మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మా ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మేము ఏం చేసినా ప్రేక్షకుల కోసమే.

Advertisement

మేము ప్రేమలో లేము అని వీరిద్దరూ చెబుతూ ఉండేవారు. ఇక సుధీర్ ఇంట్లో వాళ్ళు కూడా తనకి వయసు పెరుగుతుందని ఇంట్లో పెళ్లి చేసుకోవాలని తెగ ఒత్తిడి చేస్తున్నారట. ఇక ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక సుధీర్ కూడా పెళ్లికి ఒప్పుకున్నాడట. ఇక ఈ విషయం తెలిసి నెటిజెన్లు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు అని ఆశ్చర్యపోతున్నారట. ఇక సుడిగాలి సుదీర్ తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సుధీర్ మాత్రం పెళ్లి ఎప్పుడు, అమ్మాయి ఎవరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ విషయంపై ఇంకా క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి :

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఒకే ఓవర్ లో 6 వికెట్లు… 12 ఏళ్ల కుర్రాడు చరిత్ర

సీఎం జగన్ పాలనపై టీమిండియా క్రికెటర్ ప్రశంసలు

Visitors Are Also Reading