సాధారణంగా మనకు ఉదయం వేళలో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. లేదంటే చాలా రోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఉద్యోగులు ఆఫీస్ రద్దీకారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళుతారు. ఈఅలవాటు తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. బ్రేక్ ఫాస్ట్ పై అవగాహన ఉన్న వారు ఉదయాన్నే వంటగదిలో టిఫిన్ ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యానికి బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మీరు ఉదయం సమయంలో అల్పహారం మిస్ చేసినట్టయితే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుందనే విషయం తప్పక గుర్తించుకోవాలి. ముఖ్యంగా శక్తికి ఇది పెద్ద వనరు. ఏదైనా పని చేసే వ్యక్తులకు ఉదయం అల్పహారం చాలా ముఖ్యం. డెస్క్ వర్క్ అయినా.. ఫీల్డ్ వర్క్ అయినా ఉదయం ఏం తినకుండా పనికి బయలుదేరితే శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.
Advertisement
ఉదయం వేళలో చేసే బ్రేక్ ఫాస్ట్ శరీరానికి చాలా ముఖ్యం. ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. దీని కారణంగా శరీరంలోని కేలరీలు రోజు మొత్తం ఖర్చు అవుతాయి. మనిషిని శక్తివంతంగా ఉంచుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోవడం మరిచిపోతే అది మీ పని ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ప్రతీ రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అదేవిధంగా రక్తంలో చక్కర స్థాయి కూడా స్థిరంగా ఉంటుంది. అల్పాహారంలో పండ్లు,తృణధాన్యాలు,ప్రోటీన్లు సమృద్ధిగా ఉండాలని గుర్తుంచుకోండి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల అన్ని వేళలా అలిసిపోతారు. తగినంత నిద్ర కూడా ఉండదు. దీంతో ఎప్పుడూ చూసిన నీరసంగా బలహీనంగా కనిపిస్తారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ధనవంతులు అయ్యే వారికి ఈ సంకేతాలు కనిపిస్తాయనే విషయం మీకు తెలుసా ?
Chanakya Niti : ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకండి..!