గృహమే కదా స్వర్గ సీమ అని అంటుంటారు. అటువంటి ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతూ ఉంటె.. ఆ ఇంట్లోనే ఉండాలని అనిపించదు. అయితే ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉంటె కూడా ఇలాంటి గొడవలు జరగడం, ఇంట్లో మనుషులకు చికాకులు కలగడం జరుగుతుందట. ఈ దోషాలు కొంత వరకు తగ్గడం కోసం కొన్ని ఉపశమనం కలిగించే టిప్స్ కూడా ఉన్నాయి.
Advertisement
Advertisement
ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతున్నా ఇంట్లో నాలుగు మూలాల రాక్ సాల్ట్ ను పెట్టండి. ఈ సాల్ట్ ను నెల రోజులకు ఒకసారి మార్చాలి. ఈ నెల రోజుల్లో ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తులు ఉంటె తొలగిపోతాయి. తద్వారా గొడవలు జరగడం తగ్గుతుంది. ఇంట్లో మురికి ఉంటె, నలు మూలలా శుభ్రం చేయాలి. అలాగే ఇంట్లో పూర్వీకుల చిత్రాలను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. పూర్వీకుల చిత్రాలు ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఉంటె మంచిది.
ఇంట్లోనే వాటర్ ఫౌంటెన్, బుద్ధుడి విగ్రహం ఉంటె కూడా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి.