సాధారణంగా హీరోయిన్స్ తమ సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా నిత్యం వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి గురించి మాత్రం నిత్యం రకరకాల వార్తలు వస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్ల గురించి.. ప్రేమ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. తెలుగు అమ్మాయి అంజలి పెళ్లి గురించి కూడా రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
Advertisement
అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో చాలా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ మూవీతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ తరువాత జర్నీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది అంజలి. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ లతో కూడా అలరిస్తోంది.
Advertisement
ఇదిలా ఉంటే.. అంజలి పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఓ యంగ్ హీరోతో అంజలి ప్రేమాయణం నడిపింది అని గతంలో టాక్ వినిపించింది. ఇక ఆ తరువాత వీరిద్దరి గురించి మళ్లీ వార్తలు వినిపించలేదు. తాజాగా అంజలి తనకు కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ప్రస్తావించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రిలేషన్ షిప్ లో ఒకరి పట్ల ఒకరికి మర్యాద చాలా ముఖ్యం అని, మర్యాద లేని వ్యక్తిని ఎప్పటికీ పెళ్లికి ఒప్పుకోను అని చెప్పుకొచ్చింది అంజలి. ప్రధానంగా కెరీర్, రిలేషన్ షిప్ రెండు ముఖ్యం అని పేర్కొంటుంది ఈ బ్యూటీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆమె తల్లి లాంటిది..ఆ రూమర్స్ పై స్పందించిన ప్రభాస్ శ్రీను…!
BREAKING : బీజేపీలోకి రాజమౌళి… ఎల్లుండి అమిత్ షా తో చర్చలు ?