ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ప్రస్తుత తరం చాణక్యుడి విధానాలను అవలంభించడం వల్ల తన జీవితాన్ని సంతోషమయం చేసుకోవచ్చు. చాణక్యుడు చెప్పిన విధానాలను పాటించినట్టయితే జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని చాలా సులభంగా అధిగమించి జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందగలడు. చాణక్యుడు తన నీతిలో కొన్ని రకాల వ్యక్తులను మీ ఇంట్లో ఉండటానికి లేదా మీ జీవితంలో వచ్చేందుకు ఎప్పుడూ అనుమతించకూడదని సలహా ఇచ్చాడు.
సాధారణంగా ప్రపంచంలో చాలా మంది తమ అసలు రంగులను దాచుకుంటారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా కనిపిస్తారు. వారి వెనుక మాత్రం చెడుగా మాట్లాడుతారు. అలాంటి వారిని ఎప్పుడూ కూడా ఇళ్లలోకి రానివ్వకూడదని చెప్పాడు చాణక్యుడు. వారి వ్యక్తిత్వంలో వేర్వేరు పార్శ్వాలు ఉన్నవారు అందరికంటే చెడ్డవారు. మీ వెనుక మీ గురించి పుకార్లు వ్యాప్తి చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. జీవితంలో చెడు చేసే వాళ్లకు కొదువలేదు. ఇలాంటి వ్యక్తులు తరుచూ ప్రజల మనస్సులను విషపూరితం చేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం.
Advertisement
Advertisement
చాణక్య నీతి ప్రకారం.. ఆపద సమయంలో సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు అనే సామెత మనకు తెలుసు. కానీ ఇది విశ్వసనీయ, నిజమైన స్నేహితులకు మాత్రమే వర్తిస్తుంది. అవసరం వచ్చినప్పుడే మాత్రమే మీతో మాట్లాడే వ్యక్తులను ఇంట్లోకి కూడా రానివ్వకండి. మిమ్మల్ని ఫూల్స్ చేసే, మీ వస్తువులను సద్వినియోగం చేసుకునే లేదా ఎల్లప్పుడూ సాయం కోసం మిమ్మల్ని పిలిచే వ్యక్తులు ఉన్నారా ? వారు మీకు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఇంట్లోకి రానివ్వకండి. ఇతరులను బాధపెట్టి కొంతమంది సంతోషపడుతారు. అలాంటి వారిని కూడా ఇంట్లోకి అనుమతించకూడదు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల భావాలతో సంబంధం లేకుండా తమకు అనిపించింది చేస్తారు. వారికి చాలా దూరంగా ఉండటం ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Chanakya Niti : విజయాన్ని అడ్డుకునే దుష్ట శక్తులు ఇవే.. వెంటనే వదిలించుకోండి..!
Chanakya Niti : భార్యలో ఈ లక్షణాలున్నట్టయితే.. ఆ భర్త సన్యాసం బెటర్ అనుకుంటాడట..!