ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రత్యేకమైన పరిచయం చేయవల్సిన అవసరం లేదు. ప్రముఖ సినీ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ 1997లో విడుదలైన కోరుకున్న ప్రియుడు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వరసగా పెళ్లి, ప్రియా ఓ ప్రియా వంటి చిత్రాలతో సక్సెస్ ను అందుకొని లవర్ బాయ్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. మా బాలాజీ, మనసిచ్చి చూడు, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి హిట్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా స్టేటస్ ను సొంతం చేసుకున్నారు..
Advertisement
నవీన్ కెరియన్ లో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా సినీ కెరియర్ ని ముగించేశాడు. దాదాపు ౩౦ చిత్రాలలో హీరోగా నటించిన వడ్డే నవీన్ కు కొంతకాలనికి సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. దాంతో సినీ రంగాన్ని వదిలేసి వ్యాపార రంగం వైపు అడుగులు వేశాడు. ఇకపోతే వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చాలా దగ్గర బంధువులన్న విషయం చాలామందికి తెలియదు. వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడు అవుతాడు.
Advertisement
నవీన్ స్టార్ట్ గా కొనసాగుతున్న సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కుమార్తె చాముండేశ్వరిని వడ్డే నవీన్ ప్రేమించారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ పెద్దలను ఒప్పించి వీరి వివాహం జరిపించారట. అలా నవీన్ వరుసకు జూనియర్ ఎన్టీఆర్ కి బావ అవుతారు. కొంతకాలం తరువాత కుటుంబ కలహాల కారణంగా నవీన్ మరియు చాముండేశ్వరి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నవీన్ సినీ కెరీర్ క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. నవీన్ కు ఇండస్ట్రీలో ఆఫర్లు రాకుండా నందమూరి కుటుంబమే అడ్డు పడిందని ప్రచారం కూడా ఉంది.
ఆ తరువాత ఎంత కష్టపడిన అవకాశాలు దక్కకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. నవీన్ చివరిగా ఎటాక్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేకపోయింది. దానితో సినిమాలు చేయడం మానేసి వ్యాపార రంగం వైపు అడుగు పెట్టాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నాగచైతన్య కోట్ల విలువ చేసే లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
అమ్మకు మళ్లీ పెళ్లి చేసిన సాయి ధరమ్ తేజ్…!