Home » Saidharamtej: అమ్మకు మళ్లీ పెళ్లి చేసిన సాయి ధరమ్ తేజ్…!

Saidharamtej: అమ్మకు మళ్లీ పెళ్లి చేసిన సాయి ధరమ్ తేజ్…!

by Bunty
Published: Last Updated on
Ad

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సినిమాలలో నటిస్తూ సక్సెస్ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఆ మధ్య కాలంలో సాయిధరమ్ తేజ్ వాళ్ల అమ్మకు పెళ్లి చేశారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తల్లి విడాకులు తీసుకున్న విషయం చాలామందికి తెలియదు. సాయిధరమ్ తేజ్ చిన్నవయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మానాన్న విడిపోయారని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయ దుర్గ తన భర్త నుండి విడాకులు తీసుకొని వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లను ఒంటరిగా పెంచిందని చాలా తక్కువ మందికి తెలుసు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితమే మా అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారు. మేము చిన్నప్పటినుండి మా అమ్మ దగ్గరే పెరిగాం. ఎంతో కష్టపడి మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద హీరోలను చేసింది. అయితే మా అమ్మకి ఒక తోడు కావాలని ఆలోచించి నేను, నా తమ్ముడు ఇద్దరం కలిసి మా ఫ్యామిలీ డాక్టర్ తో మా అమ్మకి రెండవ వివాహం చేయాలని నిర్ణయించుకున్నాము.

Advertisement

ఒప్పుకోమని మా అమ్మను బలవంతం పెట్టాము. దీనికి మా అమ్మ కూడా ఓకే చెప్పింది. అందరం కలిసి మా అమ్మకు రెండో వివాహం చేశాము. ఇప్పుడు మేము అందరం చాలా సంతోషంగా ఉంటున్నాము అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ఇక ప్రస్తుతం సాయి ధరంతేజ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా నటించిన విరూపాక్ష సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతోఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు సాయిధరమ్ తేజ్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి వాళ్లే కారణమా..?

Visitors Are Also Reading