Home » ఏ టైంలో నిద్రపోతే మంచిదో మీకు తెలుసా..?

ఏ టైంలో నిద్రపోతే మంచిదో మీకు తెలుసా..?

by Sravanthi
Ad

ప్రస్తుతం మనిషి యొక్క జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఈ తరుణంలో కంటి నిండా నిద్ర కడుపునిండా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర విషయంలో దారుణమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి. ఈ స్మార్ట్ యుగంలో నిద్ర విషయంలో సమయం సందర్భం అంటూ లేకుండా పోతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల మనిషి అలసత్వం ఏర్పడుతోంది.. ఒకప్పుడు నిద్రకు సమయం అంటూ ఉండేది. రాత్రి 9 గంటలకు పడుకుంటే తెల్లవారుజామున 5, 6 గంటలకు నిద్ర లేచి ఎవరి పనుల్లో వారు ఉండేవారు. కాలంతో పాటుగా మనిషి జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వారి యొక్క బిజీ లైఫ్ లో పడి ఆహారం తినడం నిద్రపోవడం తగ్గించేశారు. మనిషి ఆరోగ్యకరమైన జీవనం కోసం నిద్ర ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

ఏడు గంటలు నిద్ర:
సాధారణంగా మనిషి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. తప్పనిసరిగా ఈ సమయాన్ని కేటాయించాలి. కానీ ప్రస్తుత జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల ప్రజలు అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటున్నారు. దీంతో చాలామంది కంటి నిండా నిద్రపోవడం మానేస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి .

Advertisement

ఏ టైంలో నిద్ర మంచిది:
రోజు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్రపోవాలి. వయసును బట్టి నిద్రపోయే వేళలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యువకులకు తొమ్మిది గంటల నుంచి 10 గంటల మధ్య నిద్రపోవడం మంచిది. ఉదయం 5 గంటల నుంచి 6గంటల మధ్య లేవాలి. ముఖ్యంగా మనిషి సరిగ్గా నిద్రపోయే సమయం 11 గంటల మధ్య పరిగణించబడుతుంది. ఇక పిల్లలకైతే 12 నుంచి 15 గంటల నిద్ర అవసరం, మరి పసిపిల్లలకు 14 గంటల నుంచి 16 గంటల నిద్ర చాలా అవసరం. ఇక యువత 7 గంటల నుంచి 9 గంటల నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading