హీరోలు కేవలం సినిమాలే కాకుండా వ్యాపారాలు కూడా చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు వ్యాపారాలు లాభాల్లో ఉంటే మరోసారి నష్టాల్లో ఉంటాయి. మన టాలీవుడ్ హీరోలు కూడా చాలా మంది అలా వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకుంటారు.
Advertisement
అంతే కాకుండా అందరూ నష్టాల్లో కూరుకుపోయింది ఒకే బిజినెస్ అదే మల్టీప్లెక్స్ బిజినెస్…కరోనా కారణంగా ఇతర కారణాల వల్లే అలా హీరోల మల్టీప్లెక్స్ లకు నష్టాలు వచ్చాయి. అలా వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మహేశ్ బాబుకు ఏఎంబీ మల్టీ ప్లెక్స్ వ్యాపారం ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎంబీ ప్రస్తుతం నష్టాల్లోనే ఉంది.
Advertisement
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ స్థలంలో ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఏఎంబీ విక్టరీ పేరుతో దీనిని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా నిర్మాణం పూర్తవకముందే నష్టాల్లో ఉన్న థియేటర్ లో రానా, వెంకటేష్ లు భారీగా పెట్టుబడులు పెట్టారు.
టాలీవుడ్ లో స్వయం కృషితో ఎదిగిన విజయ్ దేవరకొండ రౌడీ అనే బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రౌడీ వేర్ కు పెద్దగా గుర్తింపు రాలేదన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే దేవరకొండ ఓ మల్టీప్లెక్స్ ను కూడా నిర్మించారు. అయితే అది కూడా నష్టాలనే మిగిలించిందని టాక్.
also read : ఆర్జీవీకి పేర్నినాని కౌంటర్…టికెట్ 2వేలకు అమ్మాలని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి..?