Telugu News » ఆర్జీవీకి పేర్నినాని కౌంట‌ర్…టికెట్ 2వేల‌కు అమ్మాల‌ని ఏ బేసిక్ ఎక‌నామిక్స్ చెప్పాయి..?

ఆర్జీవీకి పేర్నినాని కౌంట‌ర్…టికెట్ 2వేల‌కు అమ్మాల‌ని ఏ బేసిక్ ఎక‌నామిక్స్ చెప్పాయి..?

by AJAY MADDIBOINA

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డం పై ప‌లువురు సినీప్రముఖులు విమ‌ర్శ‌లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే సినిమా టికెట్ల ఇష్యూ అనేది ఏపీ ప్ర‌జాప్ర‌తినిధులు వ‌ర్సెస్ సినిమావాళ్లు అన్న మాదిరిగా మారిపోయింది. ముందుగా సినిమా టికెట్ల ఇష్యూపై శ్యామ్ సింగ‌రాయ్ ప్ర‌మోష‌న్ల‌లో హీరో నాని స్పందించారు. దాంతో ప‌లువురు ఏపీ మంత్రులు నానిపై విమ‌ర్శ‌లు సందించారు. ఆ త‌ర‌వాత నాని మ‌ళ్లీ ఆ అంశం పై మాట్లాడ‌లేదు. ఇక తాజాగా ఇదే వివాదం పై ఆర్జీవీ వ‌ర్సెస్ ఏపీ స‌ర్కార్ అన్న మాదిరిగా క‌నిపిస్తోంది.

Ads

రామ్ గోపాల్ వ‌ర్మ ఏపీ ప్ర‌భుత్వం పై వ‌రుస ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. టికెట్ల‌పై ఏపీ స‌ర్కార్ స‌బ్సిడీ ఇవ్వాల‌ని….రేష‌న్ థియేట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని అన్నారు. అంతే కాకుండా టికెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రించే హ‌క్కు ఏపీ ప్ర‌భుత్వానికి లేద‌ని వ‌ర్మ కామెంట్ చేశారు. అలా మంత్రి పేర్ని నానికి ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ వ‌రుస ప్ర‌శ్న‌లు కురిపించారు. ఇక ఆర్జీవీ కురిపించిన ప్ర‌శ్న‌ల వ‌ర్షం పై మంత్రి పేర్ని నాని స్పందించారు.

also read : జ‌గ‌న్ స‌ర్కార్ ను ఏమైనా అనాలంటే న‌న్ను దాటి వెళ్లాలి…ఆర్జీవికి శ్రీరెడ్డి స‌వాల్..!

వంద రూపాయ‌ల సినిమా టికెల్ ను వెయ్యి, రెండు వేల‌కు అమ్మ‌కోవ‌చ్చ‌ని ఏ బేసిక్ ఎకానమిక్స్ చెప్పాయి వ‌ర్మ‌గారూ అంటూ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు. సినిమాల‌ను తాము నిత్యావ‌స‌రంగా గానీ అత్యావ‌స‌రంగా గానీ భావించ‌డం లేద‌ని అన్నారు. థియేట‌ర్ లో ప్రేక్షకుల‌కు అందించే సౌక‌ర్యాల‌ను బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల‌ను నియంత్రించాల‌ని సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం చెబుతోందని పేర్ని నాని పేర్కొన్నారు. మీరు ఏ హీరోకు ఎంత రెమ్యున‌రేష‌న్ ఇస్తారు….ఎంత ఖ‌ర్చుపెట్టి తీస్తార‌న్న‌దానిపై ఏ ప్ర‌భుత్వ‌మూ టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించ‌ద‌ని పేర్ని నాని ఆర్జీవికి కౌంట‌ర్ ఇచ్చారు.


You may also like