వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా టికెట్ల పై ప్రభుత్వం పరిమితులు విధించడాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్ లు చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని కి ట్యాగ్ చేస్తూ రాంగోపాల్ వర్మ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక వర్మ తన ట్విట్టర్ లో ఏమని పేర్కొన్నారో చూద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని మీ ప్రతినిధులను నేను కోరుతున్నాను అంటూ మంత్రి పేర్ని నాని కి వర్మ ట్వీట్ చేశారు.
Advertisement
సినిమాలతో పాటు గా ఏ ఉత్పత్తి పై అయినా మార్కెట్ ధరను నిర్ణయించడం లో ప్రభుత్వ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. గోధుమలు, బియ్యం, కిరోసిన్ మొదలైన నిత్యావసరాలకు కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సబ్సిడీలు ఇస్తుందని…. అలాగే సినిమా టికెట్ ధర విషయంలో ఎందుకు జరగదని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.
Advertisement
పేదలకు సినిమాలు చాలా అవసరమని భావిస్తే ప్రభుత్వం జేబులో నుండి మిగతా బ్యాలెన్స్ చెల్లించి వైద్య, విద్య అందించిన విధంగా సినిమాకు కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు మేలు చేయడానికి బియ్యం పంచదార ఇతర వస్తువులను అందించేందుకు రేషన్ షాపులు సృష్టించిన విధంగా రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా.? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ధరలను తగ్గించాలని… సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేక పరిస్థితిని గుర్తించారని వర్మ ప్రశ్నించారు.
Also read : రాధేశ్యామ్ వాయిదా.?..డైరెక్టర్ ట్వీట్ వైరల్..!
నిర్మాతలు టికెట్లను అమ్ముకోవచ్చని… ప్రభుత్వం కొన్ని టిక్కెట్లను కొనుగోలు చేసి పేదలకు తక్కువ ధరకు అమ్మవచ్చని దాని ద్వారా నిర్మాతలు కూడా డబ్బులు పొందుతారని.. మీరు కోట్లు పొందవచ్చని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. మీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టింది తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ఆర్జివి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడే నోరు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు… సినిమా టికెట్ల విషయంలో మీ భావాలను బయటపెట్టాలని సినీ పరిశ్రమలోని సభ్యులందరికీ ఆర్జీవి విన్నవించుకున్నారు.