మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం చాలా కీర్తించబడుతుంది. ఎలాంటి పని చేయాలన్న తప్పనిసరిగా హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, కార్యాలయం ఓపెన్ చేయాలన్న వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇలా చేస్తే మనం చేసే పని సాఫీగా సాగుతుందని నమ్ముతుంటారు. అలాగే దంపతుల మధ్య కూడా సుఖమైన జీవనం ఉండాలంటే ఈ నియమాలు పాటించాలట.. ముఖ్యంగా భార్యను భర్తకు ఎడమవైపు కూర్చోవాలని అంటుంటారు, అలాగే పడుకునే సమయంలో కూడా భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు అది ఎలాగో చూద్దామా..
Advertisement
Advertisement
శివుడిలో పార్వతి:
మన పురాణ గాథల ప్రకారం పరమశివుడిని అర్ధనారీశ్వరుడిగా కొలుస్తారు. శివుడు తన ఎడమవైపు ఉండే అర్ధ భాగాన్ని పార్వతికి సమర్పించినట్టు అనేక ఫోటోలు చూస్తాం. ఆ విధంగానే భార్యలు భర్తలకు ఎడమవైపు ఉండాలని అంటారు. దీనివల్ల వారి వైవాహిక జీవితంలో ఆనందం సంతోషం ఉంటాయని భావిస్తూ ఉంటారు. అలాగే పూజలు యజ్ఞాలు చేసే సమయంలో భార్య భర్తకు ఎడమవైపున కూర్చోవాలని పండితులు అంటారు. వివాహం, కన్యాదానం, యజ్ఞకర్మ, నామకరణం, అన్నప్రాసన సమయాల్లో కూడా భార్య భర్తకు ఎడమవైపు కూర్చుంటే అన్ని శుభాలే కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- పొంగులేటి- జూపల్లి కాంబోలో కొత్త రాజకీయ పార్టీ ?
- పెళ్లి తర్వాత ప్రతీ పురుషుడు.. ఇలా చేస్తే అస్సలు గొడవలు జరుగవు.. అవేంటో తెలుసా ?
- సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!