ఐపీఎల్-2023 ఫైనల్ లో అందరూ ఊహించిందే జరిగింది. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన రికార్డు సృష్టించింది. ఏకంగా 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. వివరాల్లోకి వెళితే… ఐపిఎల్-2023 ఫైనల్ వేదిక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం… గుజరాత్ టైటాన్స్ సొంత మైదానం..
Advertisement
వర్షం కారణంగా… లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిజర్వ్ డేకు మ్యాచ్ వాయిదా… సీజన్ ఆరంభంలో ఇక్కడే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి శుభారంభం చేసిన గుజరాత్…. ఫైనల్లోను అదే ఫలితం పునరావృతం చేసి వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవాలని భావించింది. ఒకవేళ వరణుడి కారణంగా మ్యాచ్ రద్దైపోయినా… టేబుల్ టాపర్ గా ఉన్న తమనే విజయం వర్తిస్తుందని కాస్త ధీమాగానే కనిపించింది. అయితే, సోమవారం వర్షం తెరిపినిచ్చింది.
Advertisement
టాస్ గెలిచిన చెన్నై తోలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు సాయి సుదర్శన్. అయితే… మరోసారి వరుణుడి అడ్డంకి కారణంగా సీఎస్కే లక్ష్యం 15 ఓవర్లకు 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఆ లక్ష్యాన్ని చెన్నై చేధించింది. ఇక ఈ విజయంతో చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ ఛాంపియన్ గా చెన్నై నిలిచింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !
ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?
అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..