Home » పెళ్లి తర్వాత మహిళలు బరువు ఎందుకు పెరుగుతారు?

పెళ్లి తర్వాత మహిళలు బరువు ఎందుకు పెరుగుతారు?

by Bunty
Ad

పెళ్లి తర్వాత చాలామంది ఆడవాళ్ళలో మార్పు వస్తూ ఉంటుంది. పెళ్లి అయ్యాక చాలామంది ఆడవాళ్లు బరువు పెరిగిపోతూ ఉంటారు. పెళ్లికి ముందు ఎంత సన్నగా ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత లావు అవుతారు. అయితే పెళ్లి తర్వాత ఆడవాళ్లు ఎందుకు లావు అవుతారు దాని వెనక కారణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లయిన తర్వాత సంతోషం, ఆనందం చాలా ఎక్కువగా ఉంటాయి.

Advertisement

దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. పెళ్లి తర్వాత దంపతులు శారీరకంగా కలవడం వల్ల లావు అయ్యే ఛాన్స్ ఉంది. అది కేవలం పాక్షికమే అంటూ ఉంటారు. పెళ్లి తర్వాత ఆహారం విషయంలో మార్పు వస్తుంది. తినే టైమింగ్స్ లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. అలాగే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల లావు అయ్యే అవకాశాలు ఏర్పడతాయి. పెళ్లయిన తర్వాత చాలామంది భావోద్వేగానికి లోనవుతారు. గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. గర్భధారణ కూడా ఇంకో కారణం.

Advertisement

ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది లావు అవుతూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అధిక బరువు పెరుగుతూ ఉంటారు. పెళ్లికి ముందు మహిళలు వ్యాయామం చేయడం, డైటింగ్ చేయడం లాంటి వాటి కోసం సమయాన్ని కేటాయిస్తారు. కానీ పెళ్లి తర్వాత సమయం లేకపోవడం వల్ల ఇలాంటివి చేయలేక పోతారు. పెళ్లి తర్వాత ఆడవాళ్లు ఇంట్లో ఆహారం మిగిలిపోతుందని ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా లావు అవుతారు. ఇంకా కొంతమంది వయసురీత్యా లావు అవుతూ ఉంటారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

IPL 2023 : ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా?

HEROINES: వ్య‌*చారం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

Visitors Are Also Reading