Home » ఆశిష్ విద్యార్థిని రెండో పెళ్లి చేసుకున్న రూపాలీ ఎవరు…? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?

ఆశిష్ విద్యార్థిని రెండో పెళ్లి చేసుకున్న రూపాలీ ఎవరు…? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?

by AJAY
Ad

ఇండియన్ సినీ పరిశ్రమలో ఎన్నో భాషల సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎక్కువగా ఈ నటుడు విలన్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

also read :నా మరదలు తో ఫోన్ మాట్లాడుతావా అంటూ రాఘవేంద్ర రావుతో గొడవపడ్డ రాజశేఖర్…అసలేం జరిగిందంటే…?

Advertisement

ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన వయస్సు 60 సంవత్సరాలు. ఈ నటుడు తాజాగా 60 సంవత్సరాల వయసులో రూపాలీ బారువా అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు. గతంలో ఈ నటుడు… నటి శకుంతల బారువా కూతురు రాజోషి బారువని వివాహం చేసుకున్నాడు. వీరికి అర్త్ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలం పాటు సజావుగానే జరిగిన వీరి సంసార జీవితంలో కొన్ని కలహాలు రావడంతో వీరు కొంత కాలం క్రితమే విడిపోయారు.

Advertisement

ఇలా మొదటి భార్యతో విడిపోయి ఆమెకు దూరంగా ఉన్న ఆశిష్ విద్యార్థి… రూపాలీ బరువ తో గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా వివాహం చేసుకున్నారు. అలాగే వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకున్న రూపాలీ బరువ ఎవరా అనే విషయానికి వస్తే… రూపాలీ బరువ గౌహతి కి చెందిన మహిళ. ఈమెకు కోల్ కత్తా లోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ALSO READ : ఇద్దర ప్రియుళ్లతో కలిసి యువతి ఆ పని చేసిందా ?

Visitors Are Also Reading