Home » ఇద్దరూ ప్రియుళ్లతో కలిసి యువతి ఆ పని చేసిందా ?

ఇద్దరూ ప్రియుళ్లతో కలిసి యువతి ఆ పని చేసిందా ?

by Anji
Ad

శ్రీకాకుళం జిల్లా ఎల్. కోట మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకెడ మహేశ్వరి, గాడి చిన్నతల్లిలు  వీరిద్దరూ స్నేహితులు. వీరు గ్రామంలో.. వైఎస్సార్ క్రాంతి పథకంలో బుక్ కీపర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కొద్ది రోజుల తరువాత ఆర్థిక లావాదేవీలు నడిచాయి. ఈ క్రమంలోనే మహేశ్వరీ, గాడి చిన్నతల్లి ఇద్దరు కలిసి స్త్రీ నిధి రుణాల్లోని కొంత డబ్బును అప్పుగా తీసుకొని తన అవసరాలకు వాడుకున్నారు. అయితే అప్పుగా మహేశ్వరి తీసుకున్న డబ్బును అప్పుడప్పడు బ్యాంకులో జమ చేస్తూ వచ్చేది. ఇంకా మహిళా మండలి సభ్యుల నిధులను వీరిద్దరూ వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవారు. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత.. నేను వాడుకున్న డబ్బులు ఇస్తాను. నీవు అప్పుగా తీసుకున్న డబ్బులను తీసుకు రా.. మెుత్తం అంతా లెక్క చేసి బ్యాంకులో వేద్దామని మహేశ్వరి చిన్నతల్లికి చెప్పింది. దీంతో చిన్నతల్లికి కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహేశ్వరిని చంపటానికి పథకం పన్నింది. 

Advertisement

Advertisement

చిన్నతల్లి గత కొంత కాలం నుంచి రేగ గ్రామానికి చెందిన డెంకాడ వాసును ప్రేమిస్తుంది. ప్రియుడికి జరిగిన విషయాన్ని చెప్పి మహేశ్వరిని చంపే పథకాన్ని అతడికి వివరించింది. అతడు అన్నింటికి ఒప్పుకున్నాక ఈ నెల 17 వ తేదీన మహేశ్వరిని కారులో ఎక్కించుకొని విజయనగరం మహిళా ప్రాంగణంలో సమావేశానికి బయలుదేరారు. అనంతరం అలమండసంత సమీపంలో టిఫిన్ చేశారు. అక్కడ నుంచి మళ్లీ భీమసింగి బ్రిడ్జి కిందకు కారును తీసుకెళ్లి ఆపారు. ఆ తర్వాత కారు వెనుక సీటులో కూర్చున్న మహేశ్వరి తో మాట్లాడుతూ.. ఆమె చున్నీతో గట్టిగా పీకకు ముడేసి చంపేసారు. అనంతరం చిన్నతల్లి ఆమెకు ఏమి తెలియనట్టుగా విజయనగరం సమావేశానికి వెళ్లింది. వాసు.. మహేశ్వరి శవాన్ని దూరం పడేశాడు. ఈ నెల 18 మృతదేహం వెలుగులోకి వచ్చింది.

ఆ క్రమంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. అయినా ఏమీ తెలియ రాలేదు. చిన్నతల్లి తన మీద అనుమానం రాకుండా ఫోన్ లొకెషన్స్, ఎలాంటి సమాచారం బయటపడకుండా జాగ్రత్త పడి ఆమె ప్రియుడు, మరో ప్రియుడు కోరాడ సాయికుమార్ తో కలిసి దూరంగా వెళ్లిపోవాలని బుధవారం సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు చిన్నతల్లి మీద అనుమానం వచ్చింది. ఆమెను లక్కవరపుకోట మండలం గంగుబూడి కూడలి వద్ద అదుపులోకి తీసుకొని, తమదైన పద్దతిలో అడగగా నేరాన్ని ఒప్పుకుంది. తర్వాత మిగిలిన ఇద్దర్ని కూడా అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురిని కొత్త వలస జూనియర్ సివిల్ జడ్జిముందు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ ట్వీట్స్.. అందుకోసమేనా ?

కరాటే కళ్యాణి మా సభ్యత్వంపై శ్రీరెడ్డి ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading