సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ తన సొంత టాలెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు సాధించారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఆయన కు దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారి అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే ఇక వారి ఆనందం ఎలా ఉంటుందో కొన్ని ఘటనలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ చేసిన రచ్చకు జైలు పాలయ్యారు.. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా..
Advertisement
మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. వేడుకలను చాలా ఘనంగా జరిపారు. ఇదే రోజు ఆయన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సింహాద్రి మూవీ కూడా విడుదల చేశారు. దీంతో అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. థియేటర్లలోనే క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొంతమంది అభిమానులు మరింత అభిమానంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్ సిరి కృష్ణ అనే థియేటర్లలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ ముందు రెండు మేకలను కొడవళ్లతో నరికి ఫ్లెక్సీకి రక్తాన్ని చిందించారు.
Advertisement
ఈ ఘటన అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్త పోలీసుల వద్దకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మరణాయుధాలు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారని, 9 మంది అభిమానులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. అభిమానం అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి కానీ పదిమందికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తే ఎవరైనా చట్టానికి అతిథులు కాదు.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిని సన్నిహితులు స్వార్థం కోసం వాడుకుంటారు
- ఆ రోజుల్లోనే రజినీకాంత్ జీవితాన్ని నిలబెట్టే సాయాన్ని శరత్ బాబు చేశాడనే విషయం మీకు తెలుసా ?
- ఆ సినిమాలో సావిత్రికి చెల్లలి పాత్ర అనగానే నాగేశ్వరరావు గారు ఏమి చేసారంటే ?