తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలలో అడివి శేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసహిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడిప్పుడే కెరియర్ గాడిలో పడుతున్న సందర్భంలో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. అలాంటి అడివి శేష్ ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.. అవేంటో చూద్దామా.. అడివి శేష్ ఓసారి బాలకృష్ణ వల్ల విపరీతంగా తన్నులు తిన్నాడట. అది కూడా చిన్న వయసులోనే.
Advertisement
తనకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వైజాగ్ లో ఉండేవారట. ఒక రోజు స్కూల్ నుంచి వచ్చే టైంలో ఒక కాలేజ్ దగ్గర ఒక పాట వినిపించింది. ఆ పాట బాగా నచ్చి అలాగే పాడుకుంటూ ఇంటికి వచ్చానని , ఇంట్లో కూడా ఆ పాట పాడుతుంటే అమ్మ కోపానికి వచ్చి పళ్లెంతో తల మీద గట్టిగా కొట్టింది. ఇప్పటికీ ఆ గుర్తు ఉందని అన్నారు. ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే “టాప్ హీరో”లో బీడీలు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు.. ఆ తర్వాత మరో రోజు అదే చిత్రంలోని ఓ ముద్దు పాప హే ముద్దు పాప..
Advertisement
అనే పాట పాడడంతో తన తల్లి ఉతికి ఆరేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ పాటలన్నీ బాలయ్య సినిమా నుంచి వచ్చినవే. కాబట్టి బాలయ్య వల్ల అడివి శేష్ తన తల్లి చేతిలో దెబ్బలు తిన్నారట. ప్రస్తుతం ఈ యంగ్ హీరో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఇక హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
- “బండి”తో కష్టమే.. 5 పాయింట్లు హైకమాండ్ ముందు పెట్టిన ఈటల..!!
- Chanakya Niti : వీరు విజయం సాధించేందుకు ఉపయోగపడే లక్షణాలు ఇవే..!
- ఆ రాశుల వారు జాగ్రత్త.. ఇక వారికి కష్టాలు తప్పవు..!