Home » శోభన్ బాబు మరదలిని చేసుకోవాల్సిన కృష్ణ.. కానీ అడ్డుపడింది ఎవరంటే..!!

శోభన్ బాబు మరదలిని చేసుకోవాల్సిన కృష్ణ.. కానీ అడ్డుపడింది ఎవరంటే..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందారు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు. ఇక శోభన్ బాబు ఎప్పుడు కూడా హీరోగానే ఉండాలని ఎలాంటి సైడ్ క్యారెక్టర్లు కూడా చేయలేదు. చివరికి హీరో పేరుతోనే ఆయన మరణించారు తప్ప ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి క్యారెక్టర్ కి ఒప్పుకోలేదు. అలాంటి శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు చెప్పుకునేవారు. శోభన్ బాబు ఎక్కువగా కృష్ణ గారి ఇంట్లోనే ఉండేవారు.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ తల్లిదండ్రులు శోభన్ బాబును పెద్దబ్బాయి అని పిలిచేవారట. అయితే కృష్ణ మొదట్లో ఎక్కువగా శోభన్ బాబు ఇంట్లో ఉండేవారట. ఇద్దరు తమ కష్టసుఖాలు ఒకరినొకరు చెప్పుకొని సేదతీరేవారట. అప్పట్లో శోభన్ బాబు మరదలు ఒక ఆమె ఆయన ఇంట్లోనే ఉంటుండదట. అప్పుడప్పుడు కృష్ణ ఆమెతో మాట్లాడేవారట. అయితే శోభన్ బాబుకి ఆయన మరదల్ని కృష్ణకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునే వారట.

Advertisement

ఈ విషయాన్ని కృష్ణ తల్లిదండ్రులకు చెప్పాడట. కానీ కృష్ణ తల్లి నాకు వచ్చే కోడలు నా కొడుకుల తెల్లగా ఉండాలబ్బాయి మరేమీ అనుకోకు అంటూ శోభన్ బాబుకు సమాధానం ఇచ్చిందట. ఈ విధంగా నిజ జీవితంలో దగ్గరి బంధువులు కావలసిన కృష్ణ, శోభన్ బాబుల సంబంధాన్ని ఆపింది కృష్ణ తల్లి అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే శోభన్ బాబు మరదల్ని కృష్ణ పెళ్లి చేసుకోకపోయినా కానీ వారిద్దరి మధ్య స్నేహం మాత్రం అస్సలు చెడిపోలేదట. మరణించే వరకు ఇద్దరు కలిసి ఉన్నారని తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading