ఐపీఎల్ 2023 సీజన్ సెకండ్ హాఫ్… హోరాహోరీగా సాగుతోంది. ప్లేఆఫ్స్ సమీపిస్తున్న కొద్ది జట్లు తెగించి ఆడుతున్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాయి. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ చెలరేగిన తీరే దీనికి నిదర్శనం. 149 పరుగుల లక్ష్యాన్ని పింక్ టీం… 13.1 ఓవర్లలోనే ఊది పడేసిందంటే ప్రత్యర్థిపై ఆ జట్టు ఎంతగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రూపు దశ ముగింపుకు వస్తున్నప్పటికీ ప్లే ఆప్స్ కు చేరే జట్ల విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు.
READ ALSO : సీఎం పదవి అడుగుతా.. పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
Advertisement
ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా తొమ్మిది జట్టు ఇంకా ప్లే ఆప్స్ రేసులోనే ఉన్నాయి. దీంతో గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్లో మరింత రసవత్తరంగా సాగనున్నాయి. తొమ్మిది జట్లు ప్లే ఆప్స్ రేసులో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కొన్ని జట్లకు మాత్రం ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్లే ఆఫ్స్ చేయడం దాదాపు ఖాయమైనట్లే. లక్నో సూపర్ జేయింట్స్ విషయానికి వస్తే ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి.
Advertisement
READ ALSO : పవన్ కళ్యాణ్ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్
లక్నో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఇప్పటికైతే 44 శాతం ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్లను ఆర్సిబి, పంజాబ్ కింగ్స్ తో ఆడనున్న రాజస్థాన్… ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. 10 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 13 % గా ఉన్నాయి. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన ఇప్పుడు ప్రమాదకరమైన జట్టు. ఎందుకంటే ఆరెంజ్ ఆర్మీ గుజరాత్ చేతిలో ఓడినప్పటికీ….ఆర్సిబి, ముంబై, లక్నోలపై గెలిస్తే.. ఆ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టమవుతాయి.
READ ALSO : Ustaad Bhagatsingh: “ఉస్తాద్” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్.. పవన్ ఫ్యాన్స్ కు ఇక జాతరే