గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్గా చలామణి అవుతున్న క్రమంలో హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. ఆ సమయంలోనే అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది.
READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!
Advertisement
ప్రస్తుతం ఇద్దరు తమ దాంపత్య జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తూనే వృత్తిపరంగా అలరిస్తున్నారు. అయితే గతంలో బాలీవుడ్ పరిశ్రమలో ఉన్నప్పుడు పలువురు నటలతో పిసి సంబంధాలు కొనసాగించింది. ఆ విషయాలను ఈ గ్లోబల్ స్టార్ తాజాగా బయటపెట్టింది. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక గతంలో తన రిలేషన్షిప్స్ గురించి నోరు విప్పింది.
Advertisement
READ ALSO : ‘ది కేరళ స్టోరీ’ మూవీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు
తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అంతా చాలా మంచి వాళ్ళని, ఎంతో గొప్ప వారిని తెలిపింది. “నేను గతంలో చాలా మందితో డేటింగ్ చేశా. ఒక బంధం నుంచి మరో బంధానికి మారుతూ వచ్చాను. బంధానికి, బంధానికి మధ్య ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. నా సహచర నటులతో సెట్ లో నాతో కలిసి పనిచేసిన కొందరితో డేటింగ్ చేసేదాన్ని. రిలేషన్షిప్ ఎలా ఉండాలనే దానిపై నాకు ఒక ఆలోచన ఉందనుకున్నాను. దాంతో నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నాకు తగినట్టుగానే ఉన్నారా? అనేది తెలుసుకోవాలని అనుకున్నాను” అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
READ ALSO : Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!