మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగిన హీరోలలో మోహన్ బాబు ఒకరు. సొంత టాలెంట్ తో మోహన్ బాబు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ హీరోగా 1950లో వచ్చిన అప్పు చేసి పప్పుకూడు అనే సినిమా ఆధారంగా… తప్పు చేసి పప్పుకూడు అనే వినోద భరితమైన సినిమాను తన సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పై నిర్మించారు మోహన్ బాబు.
READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్ ?
Advertisement
ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అంతకుముందు వరుస ప్లాపులు పడటంతో మోహన్ బాబు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్ కూడా హీరోగా నటించారు. అయితే ఈ సినిమా కోసం మొదటగా మోహన్ బాబు ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా అనుకున్నారు.
Advertisement
READ ALSO : DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!
ఆ సమయంలో స్టార్ హీరోయిన్ ఆర్తి పలు చిత్రాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ మోహన్ బాబు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే షూటింగ్ ప్రారంభమయ్యేసరికి ఆర్తి అగర్వాల్ తనకు ఏవో పరీక్షలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంది. అంతేకాకుండా అదే టైములో వేరే సినిమాలో నటించింది. ఈ విషయం మోహన్ బాబుకు తెలియడంతో ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆర్తి అగర్వాల్ 10 లక్షల రూపాయల ఫైన్ కట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది.
READ ALSO : Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?