నటుడు రజినీకాంత్ అంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలలో కూడా తెలియని వారు ఉండరు. నటన టాలెంట్ ఉండాలి కానీ ఎంతటి వారైనా గొప్ప స్టార్ కావచ్చని నిరూపించారు రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ ను ఆయన అభిమానులు ఇష్టంగా సూపర్ స్టార్ లీడర్ అని పిలుచుకుంటారు. నటనలో డిప్లమా చేసేందుకు రజనీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరారు. అక్కడే ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ రజనీకాంత్ ను గుర్తించారు. దీని తర్వాత 1975లో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన అపూర్వ రాగంగల్ అనే సినిమాలో చేసి రజిని చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు.
also read:ఆమెకు19,అతనికి 30..3ఏళ్ల లవ్.. కానీ చివరికి..!!
Advertisement
ఈ విధంగా ఇండస్ట్రీలో ఆయన ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. ఆయన సినీ రంగ ప్రవేశం చేసి 47 ఏళ్ళు అయిన కారణంగా నటి మీనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ పలు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టారు. నేను 169 చిత్రాల్లో నటించాను.59 చిత్రాల్లో విలన్ గా చేశాను. ఈ విధంగా ఎంతో మంది హీరోయిన్లతో నటించాను. అయినా నాకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇందులో ఒకటి శ్రీదేవి మరొకరు మీనా. ఎంగే కేతా గోల్ చిత్రంలో నేను చేసినప్పుడు మీనా వయసు 7 ఏళ్ళు. నా కూతురు గా నటించింది. ఆ తర్వాత మీనాను అన్ఫుల్ల రజనీకాంత్ లో చూశాను. ఈ సినిమాలో మేనమామగా నటించను.
Advertisement
also read:కేకేఆర్ కెప్టెన్ భార్యను వెంబడించి, వేధించిన ఇద్దరు దుండగులు
ఆ తర్వాత యజమాన్ ( రౌడీ జమీందార్ ) చేస్తున్న సమయంలో ఈ హీరోయిన్ ఎవరు అని అడిగాను. వారు మీనా అని చెప్పారు. ఏ మీనా అని అడిగాను. ఆమె నటించిన రెండు సినిమాల్లోని పాటలను ప్లే చేశారు. నేను చూసి ఆశ్చర్యపోయాను, నాతో చేసిన ఈ చిన్న పిల్ల ఇప్పుడు ఇంత అందంగా ఉందా, మొదటిరోజు షూటింగ్లో మీనా ను చూడడానికి నాకు ఆసక్తి కలిగింది. ఈ సినిమాలో మీనా నటన చూసి ఆశ్చర్యపోయాను. మీనా ఏ విధంగా చూసినా అందంగానే కనిపించింది. ఆ విధంగా మీనా ఇండస్ట్రీలో చాలా ఎదిగిందిని ఉద్వేగంగా మాట్లాడారు రజనీకాంత్.
also read:“రామబాణం” ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?