కింగ్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరికీ సాధ్యం కానటువంటి కొన్ని రికార్డులను సృష్టించాడు. ముఖ్యంగా ఐపీఎల్ 16వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం కంటే ముందు నుంచే సూపర్ ఫామ్ లో ప్రతిభ కనబరుస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు.
Also Read : కోహ్లీ వివాదంపై RCB సంచలన నిర్ణయం…!
Advertisement
ఇవాళ జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విరాట్ కోహ్లీ 12వ రన్ తో ఐపీఎల్ హిస్టరీలోనే 7వేల పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్న ఆ మ్యాచ్ కి ముందు కోహ్లీ 232 మ్యాచ్ లలో 6988 పరుగులు చేశాడు. కోహ్లీ లిఖించిన మరో రికార్డు ఏంటంటే.. ఒకే టీమ్ తరుపున 7వేల పరుగులు చేయడం ఐపీఎల్ ప్రారంభ సీజన్ అంటే 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున మాత్రమే ఆడుతున్న కోహ్లీ నేటితో 7వేల పరుగులు చేసాడు.
Advertisement
7⃣0⃣0⃣0⃣ 𝗜𝗣𝗟 𝗥𝗨𝗡𝗦 𝗙𝗢𝗥 𝗞𝗜𝗡𝗚 𝗞𝗢𝗛𝗟𝗜! 👑@imVkohli becomes the first batter to surpass this milestone in IPL 🫡
TAKE. A. BOW 👏#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/VP4dMvLTwY
— IndianPremierLeague (@IPL) May 6, 2023
ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ లో కూడా కింగ్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కోహ్లీ చేసిన 7వేల పైచిలుకు పరుగుల్లో 5 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 129.53, 36.65 యావరేజ్ ని కలిగి ఉన్నాడు. మరోవైపు కోహ్లీ తరువాత ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ (6,536) రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (6,189), రోహిత్ శర్మ (6063) పరుగులు సాధించి తరువాత స్థానాల్లో ఉన్నారు.