వన్డే ప్రపంచ కప్ కు రోజులు దగ్గరపడ్డాయి. ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ఈ షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్
Advertisement
ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం… యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూసే భారత్-పాక్ పోరు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అక్టోబర్ 7న నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కావడంతోపాటు లక్ష సీట్ల సామర్థ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు బీసీసీఐ ఈ వేదికను ఎంచుకున్నట్లు అర్థమవుతుంది.
Advertisement
READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!
వన్డే ప్రపంచ కప్ లో మొత్తం 48 మ్యాచులు జరగనుండగా… బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువహతి, హైదరాబాద్, కోల్కత్తా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, ముంబైలతోపాటు అహ్మదాబాద్ మైదానాలను షార్ట్ లిస్టు చేసినట్లు తెలుస్తోంది. మూడు నాకౌట్ రౌండ్స్ లోని 48 మ్యాచులు… 46 రోజులు జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్లను 7 వేదికలు మాత్రమే ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది.
READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!