Home » బంగారంలా మెరిసిపోతున్న బాల‌య్య హీరోయిన్…ఫోటోలు వైర‌ల్..!

బంగారంలా మెరిసిపోతున్న బాల‌య్య హీరోయిన్…ఫోటోలు వైర‌ల్..!

by AJAY
Ad

కంచె సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైన అందాల తార ప్ర‌గ్యా జైశ్వాల్. ఈ సినిమాలో అందం అభిన‌యం తో ప్ర‌గ్యా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఊర్లో దొర‌సాని పాత్ర‌లో న‌టించిన పొడవాటి సుంద‌రికి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ఆ త‌ర‌వాత అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసినా మ‌ళ్లీ హిట్స్ అందుకోలేక పోయింది. ఇక రీసెంట్ గా బాల‌క్రిష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమా ద్వారా ఈ బ్యూటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో బాల‌య్య‌ను ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌లో హీరో శ్రీకాంత్ న‌టించాడు. ఇక ఈ సినిమా ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. అంతే కాకుండా సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురింసింది. అంతే కాకుండా సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్న‌ట్టు గా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇప్పటికే హాట్ స్టార్ తో ఒప్పందం జ‌రిగిన నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో కూడా త‌న అందం అభిన‌యం తో ఆక‌ట్టుకున్న ప్ర‌గ్యా జైశ్వాల్ తాజాగా చీర క‌ట్టు అందాల‌తో మ‌తిపోగొడుతోంది. అంతే కాకుండా గోల్డెన్ క‌ల‌ర్ లో ఉన్న చీర క‌ట్టుకుని ప్ర‌గ్యా జైశ్వాల్ అర‌వై కిలోల బంగారంలా మెరిసిపోతుంది. దాంతో ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతుండ‌గా అఖండ బ్యూటీకి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

Also read : ఆమెకు హ‌క్కుంది..ఆల్ ద బెస్ట్ దీపూ అంటూ ష‌ణ్ముక్ భావోద్వోగం..!

Visitors Are Also Reading