మనలో చాలామంది నిద్రిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా లేచి ఉలిక్కి పడుతూ ఉంటారు. ఆ తర్వాత లేచి నా గుండెలపై ఎవరో కూర్చున్నట్లు, గొంతు పిసుకుతున్నట్లు గట్టిగా అరుస్తున్నట్లు అనిపించిందని అంటారు. అయితే ఇలా జరిగే దాన్ని శాస్త్రవేత్తలు “స్లీపింగ్ పెరాలసిస్” అంటున్నారు.. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలు ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు.
also read:ఈషా అంబానీ ఒక్క పెళ్లికార్డు ధరతో 3 పెళ్లిళ్లు చేయొచ్చు..!!
Advertisement
మెదడులో నిర్దేశిత ప్రాంతంలో చోటు చేసుకునే కల్లోలం దెయ్యాలు, రాక్షసుల రూపంలో నిద్రలో కనిపిస్తాయని వారు తెలియజేశారు. దీనినే మనం దయ్యంగా భావించి భయపడతామని స్పష్టం చేశారు. నిద్రపోతున్న సమయంలో ఒక్క కండరాన్ని కూడా కదల్చలేని పరిస్థితిలో ఏదో ఉనికి గదిలో స్పష్టం అవుతూ ఉండగా , మన చాతి మీద కూర్చొని ఊపిరిని నొక్కేస్తూ ఉండటమే స్లీపింగ్ పెరాలసిస్ అంటారు. అంతేకాకుండా మంచి నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారి కనిపిస్తే వెంటనే లేచి కూర్చుంటారు కూడా, అంతేకాకుండా ఉలిక్కిపడి లేచి మరీ భయపడతారు.
Advertisement
also read:మీ భార్యతో పొరపాటున కూడా ఈ 3 విషయాలు మాట్లాడొద్దు..2వది చాలా ఇంపార్టెంట్..!!
కానీ కొంతమంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరూ పలకరు. మెలకువ వచ్చినా కానీ లేవలేరు కూడా. దీనినే ఆధునిక వైద్యంలో స్లీప్ పెరాలసిస్ అని స్పష్టం చేసింది. నిద్ర సమయంలో మెదడు శరీరం ఒకచోట లేనప్పుడు స్లీపింగ్ పెరాలసిస్ చోటు చేసుకుంటుందట. ఇటువంటి పరిస్థితి వల్ల మనుషులకు రకరకాల భ్రమలు కలుగుతాయని, దీనివల్ల ఎలాంటి హాని ఉండదని శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు.
also read:బెల్లంకొండ ‘ఛత్రపతి’ ట్రైలర్ చూశారా..? అద్భుతమే..!