Home » బెల్లంకొండ ‘ఛత్రపతి’ ట్రైలర్ చూశారా..? అద్భుతమే..!

బెల్లంకొండ ‘ఛత్రపతి’ ట్రైలర్ చూశారా..? అద్భుతమే..!

by Anji
Ad

టాలీవుడ్ లో రెబల్ స్టార్ హీరోగా, దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్  హీరోగా హిందీలోకి ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ హిందీలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయకగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్  విడుదల చేశారు.  

Also Read :  రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!

Advertisement

ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. తెలుగులో ప్రభాస్ యాక్టింగ్ చేసిన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కష్టపడ్డారు. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్ గా రూపొందింది. యాక్షన్ సన్నివేశాల్లో అదుర్స్ అనిపించాడు బెల్లంకొండ. ఈ ట్రైలర్ తో ‘చత్రపతి’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. అదేవిధంగా బెల్లంకొండకు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.హిందీ చత్రపతి కోసం బెల్లంకొండ తన బాడీ షేప్ ను మొత్తం పూర్తిగా మార్చేశాడు. 

Advertisement

Also Read :  యాంకర్ శ్రీముఖి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!

Manam News

తెలుగులో ప్రభాస్ కండలతో, ఫిట్ గా ఎలా కనిపించాడో అదే విధంగా  పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు శ్రీనివాస్.దాదాపు 18 ఏళ్ల కింద టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఛత్రపతి ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుండడంతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మే 12 వరకు వేచి ఉండాల్సిందే. 

Also Read :  Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!

Visitors Are Also Reading