Home » పెళ్ళిలో అల్లుడు కాళ్లు మామ ఎందుకు కడుగుతారో తెలుసా..?

పెళ్ళిలో అల్లుడు కాళ్లు మామ ఎందుకు కడుగుతారో తెలుసా..?

by Sravanthi
Ad

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైనటువంటి ఘట్టం. చాలామంది ఈ పెళ్లిని వారికి నచ్చిన విధంగా రకరకాలుగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి వివాహంలో ఈ విధంగా జరిపే తంతు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అలాంటి వివాహంలో తప్పనిసరిగా అత్త, మామ అల్లుడి కాళ్లు కడుగుతారు.. మరి ఎందుకు కడుగుతారో ఇప్పుడు తెలుసుకుందామా..

also read:Meter ott release date : ఓటిటిలో ‘మీటర్’… స్ట్రీమింగ్ ఎక్కడంటే…?

Advertisement

చాలా గ్రాండ్ గా చేసుకునే వివాహమైన, సింపుల్ గా చేసుకునే పెళ్లి అయినా సాంప్రదాయం మాత్రం పాటిస్తారు. ఈ పెళ్లిలో కన్యాదానం అనేది ప్రధానమైనటువంటి ఘట్టం. దీనిలో మామా అల్లుడు కాళ్లు కడిగే సాంప్రదాయం తప్పనిసరిగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా అసలు అల్లుడు కాళ్లు మామయ్య ఎందుకు కడగాలి దాని వెనుక రహస్యం ఏంటో పెళ్లి చేసుకున్న చాలామందికి తెలియదు.. అసలు విషయంలోకి వెళ్తే.. దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉందట.. మండపానికి పడమటి దిశలో పెళ్ళికొడుకు కూర్చుని ఉంటే..

Advertisement

also read:చిరంజీవితో…కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

కన్యాదాత అయినటువంటి మామ అల్లుడు యొక్క కుడికాలు తర్వాత ఎడమ కాలుని కడిగి, ఆ తర్వాత ఆ నీటిని నెత్తిపై చల్లుకుంటారు. చిన్నప్పటి నుంచి అల్లారం ముద్దుగా పెంచుకున్న తన కూతురిని ధర్మ, అర్థ కా* మొక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్లి కుమారుడిని శ్రీమన్నారాయణ బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడు కాళ్ళు కడుగుతారు.

also read:సంతోషం గా ఉండండి…మాజీ భర్త మరణం పై నటి సంచలన పోస్ట్….!

Visitors Are Also Reading