Home » April 29th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 29th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 7,171 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 51,314 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

టీడీపీలో చేరుతానన్న వార్తలు అవాస్తవం అని రాజాసింగ్ అన్నారు. బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్‌ కార్యాలయం ప్రారంభం కానుంది. ఢిల్లీ వసంత్‌ విహార్‌లో బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం ను ప్రారంభించనున్నారు.

జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్‌ విద్యార్థి వెంకట్‌ మొదటి ర్యాంక్ సాధించాడు. 300/300 మార్కులు వెంకట్‌ కౌండిన్య సాధించాడు. విజయవాడకు సాయినాథ్‌కు పదో ర్యాంక్‌ వచ్చింది.

Advertisement

జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలయ్యింది. మ్యాన్‌హోల్‌ మూత తెరచివుండటంతో డ్రైనేజీలో పడిపోయిన చిన్నారి. పార్క్‌లైన్‌ దగ్గర పాప మృతదేహం గుర్తించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుంది. గంట వ్యవధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం.. మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, నాంపల్లిలో 6, ఉప్పల్‌, ఆసిఫ్‌నగర్‌, బాలానగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు జరిగాయి.

నేడు కోల్‌కతా వర్సెస్‌ గుజరాత్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఢిల్లీతో హైదరాబాద్‌ ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Visitors Are Also Reading