Home » ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ తేదీలివే

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ తేదీలివే

by Bunty
Ad

 

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ పరీక్షల్లో 4 లక్షల 84 వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5 లక్షల19 వేలమంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ హాజరయ్యారు.

Read Also : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Advertisement

ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే ఇంటర్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏపీ విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Read Also : మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : CM KCR

మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!

Visitors Are Also Reading