ఐపీఎల్ 2023లో చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు కోల్కతా నైట్ రైడర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో తన హోమ్ గ్రౌండ్ లోనే ఆర్సిబిని చిత్తు చేసింది. 21 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది. ఇది ఇలా ఉండగా, బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొనున్నాడు.
READ ALSO : ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ
Advertisement
ఆర్సిబి రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ పక్కటెముకల గాయంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవ్వగా… కోహ్లీ తాత్కాలిక సారధిగా జట్టును నడిపిస్తున్నాడు. కోహ్లీ తన సారథ్యంలో వరసగా రెండు మ్యాచ్ ల్లో అద్భుత విజయాలు అందించాడు. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోతకు గురయ్యాడు. కోహ్లీ కన్నా ముందే స్లో ఓవర్ రేట్ కు మొదటి తప్పిదంగా ఫాఫ్ డూప్లెసెస్ కు రూ.12 లక్షల జరిమానా పడింది. తాత్కాలిక సారధిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ కూడా స్లో ఓవర్ రేటును కొనసాగించడంతో మ్యాచ్ ఫీజులో 24 లక్షలు కోత వేయడంతో పాటు టీం ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20% కట్ చేస్తూ జరిమానా విధించింది.
Advertisement
READ ALSO : ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !
మరోసారి ఆ జట్టు స్లో ఓవర్ రేటుకు గురైతే ఆ మ్యాచ్ కెప్టెన్ గా వ్యవహరించే కెప్టెన్ పై నిబంధనల ప్రకారం ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. ఫాఫ్ డూప్లెసిస్ ఇంకా పూర్తిగా కోలుకోనందున కోహ్లీనే మరో రెండు మ్యాచ్ ల వరకు సారధిగా కొనసాగే అవకాశం ఉంది. స్లో ఓవర్ రేటుకు కారణమైతే అతను ఓ మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కోహ్లీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని, లక్నో సారధి కేఎల్ రాహుల్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
READ ALSO : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉద్యోగాలు…జీతం రూ. 35 వేలు